BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 June 2026, 03:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కొల్లూరి సుధారాణి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:39 PM
136 వీక్షణలు

ఏలూరులో భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. 16వ డివిజన్ శాఖ కార్యదర్శి ఉప్పులూరి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ పతాకాన్ని ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ మహిళల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేసిన సంస్థగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూను కొనియాడారు. పోరాటాల ద్వారా సాధించిన మహిళా రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఏలూరు ఏరియా ఉపాధ్యక్షురాలు గొర్లి స్వాతి మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఉప్పులూరి భవాని, రాజామణి, జ్యోతి, తాళ్లూరి సురేఖ, లక్కపాము ఝాన్సీ, పల్లిపాము సింధు, ఆలూరి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.