BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 06 February 2026, 08:34 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

తెలంగాణ
06 Feb, 2026 - 08:34 PM
417 వీక్షణలు
ఓటర్లను ప్రలోభాల నుండి అడ్డుకోవాలి మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: రాణి కుముదిని NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు చెందిన జనరల్ అబ్జర్వర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఏడీజీపీ మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ, ఎన్నికలు పూర్తిగా నిష్పక్షపాతంగా జరగాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఏడీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, నగదు పంపిణీ, ప్రలోభాలకు ఉపయోగించే సామగ్రిపై ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలతో నిరంతర నిఘా కొనసాగించాలని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు, రౌడీషీట్ నమోదైన వ్యక్తులపై పోలింగ్ రోజున ప్రత్యేక షాడో టీమ్‌లతో నిఘా పెట్టాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, ఎన్నికల పరిశీలకులు గౌతమి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 104 వార్డులకు గాను 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. #MunicipalElections #FreeAndFairElections #ElectionCommission #NoVoterInducement #TelanganaElections #YadadriBhuvanagiri #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube