BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 28 February 2026, 05:35 am
Posted by : NTODAY NEWS OFFICIAL

హంతకులకు మద్దతా? బాధితులకు న్యాయం ఎక్కడ?

తెలంగాణ
28 Feb, 2026 - 05:35 AM
343 వీక్షణలు
హంతకులకు మద్దతా? బాధితులకు న్యాయం ఎక్కడ? NTODAY NEWS: హైదరాబాద్ కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీపై రాష్ట్ర రజక సంఘాల తీవ్ర అభ్యంతరం హైదరాబాద్, ఫిబ్రవరి 28, 2026: ఇటీవల జరిగిన దాడి ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ వైఖరిపై రాష్ట్ర రజక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బాధితులను పరామర్శించకుండా, వారి తరఫున పోరాడుతున్న నాయకులు మరియు సంఘాలను అవమానించేలా వ్యాఖ్యానించడం బాధాకరమని పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన సంఘాల ప్రతినిధులు, ఈ కేసులో స్థానిక పోలీసుల పాత్ర పక్షపాతంగా ఉందని ఆరోపించారు. ఘటన జరిగిన రాత్రి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ సమక్షంలోనే దాడి కొనసాగిందని తెలిపారు. బాధితురాలు తన భర్తను విడిచిపెట్టాలని వేడుకున్నప్పటికీ, దాడి ఆగలేదని ఆరోపించారు. దాడి సమయంలో మహిళలపై కూడా దురుసుగా ప్రవర్తించినట్లు, కుల దూషణలు చేసినట్లు సంఘాలు ఆరోపించాయి. ఘటనకు పది రోజులు గడిచినా బాధితులను కలవకుండా, నిందితుల ఇంటికి వెళ్లి వ్యాఖ్యానించడం అనుచితమని పేర్కొన్నారు. నిజనిర్ధారణ కమిటీ వాస్తవాలను పరిశీలించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధులు మానవీయతను రుజువు చేసుకోవాలని కోరారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్లు: ఫైళ్ళ ఆశయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం. జూపల్లి రాజ శేఖర్ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ. కొత్తకొండ్ల శ్రీలక్ష్మి రాష్ట్ర అధ్యక్షులు చాకలి ఎస్సీ సాధన సమితి. జలంపల్లి వెంకటరాములు రాష్ట్ర అధ్యక్షులు మన రజక సంఘం. గోపి రజక రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. పెద్దాపురం కుమారస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ రజక సంఘాల సమితి. కోన్నె సంపత్ ,రాష్ట్ర కన్వీనర్ రజక సంఘం సమన్వయ కమిటీ. నడిమింటి శ్రీనివాస్ జాతీయ అధ్యక్షులు నేషనల్ ధోబి రిజర్వేషన్ సంగ్. బాలాపూర్ బాలారాజ్ రాష్ట్ర అధ్యక్షులు రజక జాగృతి. పూసల సంపత్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రజక సంఘం. ఐతారాజు అభయాంధర్ రాష్ట్ర అధ్యక్షులు బిసి పోరాటం సమితి. ఆవనగంటి సైదులు రాష్ట్ర అధ్యక్షులు రజక ఫిషర్ మెన్ రాష్ట్ర సొసైటీల కమిటీ. రజక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్. ఈ ప్రకటనపై రాష్ట్ర స్థాయి రజక సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా సంతకం చేశారు. #PressNote #RajakCommunity #JusticeForVictims #TelanganaNews #Hyderabad #SocialJustice Follow us on Website Facebook Instagram YouTube