BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 08 August 2025, 03:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బాలల స్నేహపూర్వక న్యాయ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
08 Aug, 2025 - 03:45 AM
232 వీక్షణలు
నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు,బాలల స్నేహపూర్వక న్యాయ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు అన్నారు ... NTODAY NEWS: ఏలూరు,ఆగస్టు 06: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం "జాతీయ న్యాయ సేవాధికార సంస్థ-బాలల స్నేహ పూర్వక న్యాయ సేవలు పథకం 2024" పై బాలలకు అవగాహన కలిగించాల్సి ఉందని అందులో భాగంగా బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ఏలూరు శాంతి నగరులోని ఆక్సఫోర్డ్ ఒలింపియాడ్ స్కూలు విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ బాలలు విద్యార్థి దశ ఉండే చట్టాల పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.ప్రస్తుత సమాజంలో విద్యార్థులే లక్ష్యంగా సంఘ విద్రోహ శక్తులు మానవ అక్రమ రవాణా,డ్రగ్స్ విక్రయం లాంటి దుశ్చర్యలకు పాల్పడు తున్నాయని కావున యువత అపరిచిత వ్యక్తులతో అతి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని, అలాగే గుడ్ టచ్ బాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని బాల్య వివాహాలను నిరోధించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. బాలలకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి ఇంచార్చి చైర్మన్ పి.వెంకటేశ్వర రావు,న్యాయవాది పి.రత్నరాజు, ఆక్స్ ఫోర్డ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ పసుపులేటి సునీల్ కుమార్,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube