BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 07:39 AM
56 వీక్షణలు

మండుటెండల్లోనూ విధి నిర్వహణ.

అన్నమయ్య జిల్లా మదనపల్లె, జూన్ రోజురోజుకూ భగభగమంటున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రోడ్లపై నిరంతరం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్  ఆదేశాల మేరకు, శుక్రవారం మదనపల్లెలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్  వేసవి రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా ఒక్కో సిబ్బందికి సూర్యుని ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను కాపాడే గాగుల్స్, తెల్లటి టోపీలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, స్టీల్ వాటర్ బాటిళ్లతో పాటు రెండు జతల ట్రాఫిక్ యూనిఫామ్లను ఎస్పీ  స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ  సిబ్బంది యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకోవడంతో పాటు, మదనపల్లె పట్టణంలోని వివిధ రద్దీ కూడళ్లలో వారు నిర్వర్తిస్తున్న విధులపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ.. "తీవ్రమైన ఎండల్లోనూ ప్రజల భద్రత, సుగమమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం మీరు పడుతున్న శ్రమ అభినందనీయం. విధి నిర్వహణ ఎంత ముఖ్యమో, మీ ఆరోగ్య రక్షణ కూడా అంతే ముఖ్యం. ఎండ తీవ్రతను తట్టుకునేలా విధుల్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం, మంచినీరు తాగుతూ డీహైడ్రేషన్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి" అని సూచించారు.

ఈ కార్యక్రమంలో మదనపల్లె ట్రాఫిక్ సీఐ గురునాథ్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ రవి, ట్రాఫిక్ మహిళా ఎస్ఐలు గాయత్రి, శివకామిణి, ఆర్ఎస్ఐ చంద్రశేఖర్ తదితర ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.