BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 09 March 2026, 02:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

టీ20లో టీమిండియా విజయం

ఆంధ్రప్రదేశ్
09 Mar, 2026 - 02:45 AM
530 వీక్షణలు
టీ20లో టీమిండియా విజయం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆనందం పంచుకున్న అమడగూరు ప్రజలు NTODAY NEWS: అమడగూరు ప్రతినిధి రామాంజనేయులు టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాను చూసి దేశమంతా గర్విస్తోంది. ప్రపంచ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించడంతో అభిమానులు, క్రీడాభిమానులు భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ప్రతిభతో దేశానికి గౌరవం తీసుకొచ్చారని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అమడగూరు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్లారు. టీమిండియా విజయాన్ని ఆనందంగా జరుపుకుంటూ విద్యార్థులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత జట్టు సాధించిన విజయం దేశ యువతకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని కష్టపడి శ్రమిస్తే గొప్ప విజయాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, క్రీడ ఉపాధ్యాయుడు ముని మరియు ఇతరులు పాల్గొన్నారు. #TeamIndia #T20Victory #IndianCricket #Amadaguru #StudentRally #SportsInspiration #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube