బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు వీరిద్దరిని సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు.
తీర్మానంపై మండలిలో మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా.. తీర్మానం నెగ్గింది. దీంతో తాతా మధు, నవీన్ రెడ్డిని ప్రస్తుత శాసనసభ సమావేశాల సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
అనంతరం శాసనమండలి సమావేశాలను ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.