BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 01 June 2026, 07:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 07:05 PM
208 వీక్షణలు

తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

మృతుడు బంటి కుమార్ (26)గా గుర్తించారు. అతడు బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లా దేనాపూర్ మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందినవాడు. ఉపాధి కోసం తాతకుంట్ల గ్రామానికి వచ్చి, 2026 మే 17 నుంచి స్థానిక రైతు వడ్లమూడి చెన్నారావు వద్ద గేదెల షెడ్డులో నెలకు రూ.20 వేల జీతంతో పనిచేస్తున్నట్లు సమాచారం.

అయితే మే 31 రాత్రి సుమారు 10 గంటల సమయంలో బంటి కుమార్ తన అన్నతో పాటు ఇతర బంధువులతో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. అనంతరం జూన్ 1 ఉదయం అతడు నివసిస్తున్న రేకుల షెడ్ తలుపులు తెరిచి చూడగా లోపల ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విస్సన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)కి తరలించారు.

మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు.