తాతకుంట్లలో రీసర్వే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
రైతులకు పాసుపుస్తకాలు అందించిన తిరువూరు ఆర్డీవో కుమార్
విస్సన్నపేట: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో జరుగుతున్న రీసర్వే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని తిరువూరు ఆర్డీవో కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు.
కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీకళ్యాణి, డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్, గ్రామ సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్.టి. వెంకటేశ్వరరావు, తెల్లదేవరపల్లి సొసైటీ అధ్యక్షులు వీరమాచినేని కృష్ణప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోలేటి రంగారావు, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణావతు రాంబాబు, తెలుగుయువత నాయకులు గంటా రాజేష్, నల్లచెరువు నీటి సంఘం అధ్యక్షులు దమ్మలపాటి శివరామకృష్ణ పాల్గొన్నారు.
అనంతరం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న వీఆర్వో కార్యాలయ భవనాన్ని పూర్తి చేయడంతో పాటు గ్రామంలో నెలకొన్న ఇతర సమస్యలను సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్.టి. వెంకటేశ్వరరావు, వీరమాచినేని కృష్ణప్రసాద్ ఆర్డీవో కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిశీలించిన ఆర్డీవో వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.