BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 04:07 pm
Posted by : కూనురు మధు

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ, బీఆర్ఎస్ పని : ప్రభుత్వ విప్ వేముల వీరేశం ధ్వజం

తెలంగాణ
/ హైదరాబాద్
03 Jun, 2026 - 04:07 PM
139 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించినట్లు ప్రభుత్వ విప్ & నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంబద్ధ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

*తుమ్మిడి హట్టి ప్రాజెక్టు రాష్ట్రానికి అవసరం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించే దిశగా తుమ్మిడి హట్టి ప్రాజెక్టు కీలకమని వేముల వీరేశంగారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం జాతీయ ప్రాజెక్టులను కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులపై ఉందని గుర్తు చేశారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బండి సంజయ్‌కు మా ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు.

*బీజేపీ-బీఆర్ఎస్ కుట్ర

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. గత 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని, వాటిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించినప్పటికీ కేంద్రం ఇప్పటివరకు తేల్చలేదని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు పట్ల బీజేపీకి మొదటి నుండి వ్యతిరేక ధోరణి ఉందని, నాడు తెలంగాణ ప్రాంతంలో ఇకపై ఒక్క బిడ్డ కూడా బలిదానం కాకూడదనే ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కెసిఆర్ తెలంగాణపై నిజమైన ప్రేమ ఉంటే జూన్ 2న అమరవీరులకు నివాళులర్పించేవారని, ఆయన ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళిత ముఖ్యమంత్రి అంటూ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వెనుక బీజేపీ–బీఆర్ఎస్ రాజకీయ ఆట ఉందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చి రాహుల్ గాంధీ  ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, ఈ లక్ష్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ము, ధైర్యము కూడా రాహుల్ గాంధీ  వెన్నుదున్నగా ఉంటుందని వేముల వీరేశం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ ప్రాజెక్టులు తీసుకురావాలి తప్ప తెలంగాణకు శాపంలా మారకూడదని బండి సంజయ్‌కు హితవు పలికారు.