BREAKING
thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన
Date of Publish : 09 August 2026, 07:52 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో రేపటితో ముగియనున్న ఎస్‌ఐఆర్ గడువు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Aug, 2026 - 07:52 AM
52 వీక్షణలు

తెలంగాణలో రేపటితో ముగియనున్న ఎస్‌ఐఆర్ గడువు

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఇంటింటి ఎన్యుమరేషన్‌ ఫారాల సమర్పణకు గడువు ఆగస్టు 10తో ముగియనుంది. ఈ గడువును ఇకపై పొడిగించే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఓటరు జాబితాలో తమ పేర్లు సక్రమంగా ఉండేలా చూసుకోవడంతో పాటు, అవసరమైన వివరాలను ఎన్యుమరేషన్‌ ఫారాల్లో నమోదు చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫారాలు అందుకున్నప్పటికీ పూర్తి చేయని వారు, అలాగే ఇప్పటివరకు ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు వెంటనే తమ ప్రాంతంలోని బూత్‌ స్థాయి అధికారులను (బీఎల్‌ఓ) సంప్రదించాలని ఎన్నికల అధికారులు సూచించారు.

గడువు ముగిసేలోపు పూర్తి చేయాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా సేకరించిన వివరాల ఆధారంగా ఓటరు జాబితాను సవరించనున్నారు. అర్హులైన ఓటర్లు తమ వివరాలు నమోదు చేసుకోకపోతే తదుపరి ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, ఆగస్టు 10లోపు ఎన్యుమరేషన్‌ ఫారాల సమర్పణ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఓటు హక్కు కలిగిన ప్రతి అర్హుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలు సరిగ్గా నమోదు అయ్యేలా చూసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది.