BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 15 May 2026, 03:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో వడదెబ్బ మరణాల లెక్కల్లో భారీ తేడా..

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:46 PM
141 వీక్షణలు

తెలంగాణలో వడదెబ్బకు బలవుతున్న వారి సంఖ్య విషయంలో ప్రభుత్వ లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం బయటపడింది.

2024 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేవలం 10 వడదెబ్బ మరణాలను మాత్రమే నమోదు చేయగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం ఏకంగా 116 మంది మృతి చెందినట్లు వెల్లడైంది.

అంటే సుమారు 106 మరణాలు ప్రభుత్వ అధికారిక లెక్కల్లో నమోదు కాకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అందించే రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం ఆ మరణం అధికారిక రికార్డుల్లో ఉండటం తప్పనిసరి.

దీంతో అనేక కుటుంబాలు ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య నిర్ధారణ లోపాలు, అధికారిక ధృవీకరణ ప్రక్రియలో జాప్యం, స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే అనేక కేసులు నమోదు కాకుండా పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వడదెబ్బ మరణాల గుర్తింపు, నమోదు ప్రక్రియను మరింత సరళతరం చేసి పారదర్శకంగా అమలు చేస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.