BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 May 2026, 12:59 pm
Posted by : కూనురు మధు

తెలంగాణలో వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది బలి

తెలంగాణ
/ తెలంగాణ / హైదరాబాద్
26 May, 2026 - 12:59 PM
266 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అంచనాలకు అందడం లేదు. రోహిణి కార్తె ప్రవేశంతో భానుడు మరింత నిప్పుల చెరుగుతున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడమే కాకుండా, ఊపిరి సలపనివ్వని వడగాలులు తోడవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. సోమవారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా తెలంగాణ  రాష్ట్రంలో 52 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ​గడిచిన వారం రోజుల్లోనే మృతుల సంఖ్య 222 కి చేరడం చూస్తుంటే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎంతటి విపత్కరంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాల వారీగా 

​సరిహద్దు జిల్లాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నిన్న సంభవించిన మరణాలలో 

​ఉమ్మడి వరంగల్ జిల్లా  అత్యధికంగా 16 మంది మృతి చెందారు.bఉమ్మడి ఖమ్మం జిల్లా  ఎండల తీవ్రతకు 14 మంది బలయ్యారు. ​ఉమ్మడి కరీంనగర్ జిల్లా  వడదెబ్బ కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ​ఉమ్మడి నల్గొండ జిల్లా: ఆరుగురు (6) మృతి చెందారు.​నిజామాబాద్ జిల్లా: నలుగురు (4) బలయ్యారు. ​సిద్దిపేట జిల్లా: ఒకరు (1) మరణించారు. సాధారణంగా 'రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి' అంటారు. దానికి తగ్గట్టే ప్రస్తుతం వాతావరణం ఉంది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి అది అగ్నిగుండంగా మారుతోంది. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వడగాలుల తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు.

​వారంలోనే 222 మంది చనిపోవడం అనేది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, ఒక రకమైన ప్రకృతి విపత్తుగా పరిగణించాల్సి ఉంటుంది.