BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 07 September 2026, 11:39 am
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణలోనే అత్యంత ఎత్తైన శిఖరం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Sep, 2026 - 11:39 AM
10 వీక్షణలు

తెలంగాణలోనే అత్యంత ఎత్తైన శిఖరం.. మన ములుగు జిల్లాలోనే!

965 మీటర్ల ఎత్తులో డోలి గుట్ట.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ప్రకృతి అందాల నిలయం

ములుగు | Ntoday News

తెలంగాణలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎక్కడుందో తెలుసా? ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న డోలి గుట్ట తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన శిఖరంగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి సుమారు 965 మీటర్లు (3,166 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ శిఖరం తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. 

దట్టమైన అడవులు, కొండలు, లోయల మధ్య ఉన్న డోలి గుట్ట ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్‌ ఆసక్తి ఉన్నవారిని ఆకట్టుకునే ప్రాంతంగా నిలుస్తోంది. ఇది దక్కన్ పీఠభూమి ఉత్తర భాగంలో ఉంది. 

965 మీటర్ల ఎత్తు.. తెలంగాణలోనే నంబర్ వన్

డోలి గుట్ట ఎత్తు 965 మీటర్లు కాగా, వెంకటాపురం మండలంలోని ఇతర ప్రముఖ కొండల్లో బేడం గుట్ట సుమారు 856 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో డోలి గుట్ట ఈ ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత శిఖరంగా నిలిచింది. 

గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెదకోండ 1,360 మీటర్ల ఎత్తుతో ఈ ప్రాంతంలో అత్యున్నత శిఖరంగా ఉండేది. అయితే 2014 రాష్ట్ర పునర్విభజన అనంతరం చింతూరు, వరరామచంద్రాపురం తదితర మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లడంతో ప్రస్తుత తెలంగాణలో అత్యంత ఎత్తైన శిఖరంగా డోలి గుట్ట నిలిచింది. 

పర్యాటక అభివృద్ధికి అవకాశం

ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ములుగు జిల్లాలోని ఈ అటవీ ప్రాంతం ప్రకృతి పర్యాటకానికి మంచి అవకాశాలను కలిగి ఉంది. డోలి గుట్టతో పాటు పరిసర కొండలు, అటవీ ప్రాంతాలను కలుపుకుని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ములుగు జిల్లాకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.