తిరుపతి విజయోత్సవ సభకు బయలుదేరిన సొంగా రోషన్ కుమార్
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తిరుపతిలో నిర్వహించబడుతున్న విజయోత్సవ సభలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొననున్నారు.
గురువారం, శాసనసభ్యులు రోషన్ కుమార్ గన్నవరం విమానాశ్రయం నుండి తిరుపతికి పయనమయ్యారు. శుక్రవారం ఆ రోజు, తిరుపతిలో జరుగనున్న సభలో ముఖ్యమంత్రివర్యులు మరియు ఇతర సహచర శాసన సభ్యులతో కలసి పాల్గొని, కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా విజయోత్సవానికి సాక్ష్యంగా నిలవనున్నారు.