BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 14 June 2026, 06:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరుపతిలో కలకలం రేపిన కుళ్లిన మాంసం నిల్వలు – భారీ దాడుల్లో వెలుగులోకి నిజాలు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 06:28 AM
206 వీక్షణలు

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారీగా కుళ్లిన మాంసం నిల్వలు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరపాలక సంస్థ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వందల కిలోల పాడైపోయిన మాంసం స్వాధీనం చేసుకున్నారు.

మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో 28వ వార్డు పరిధిలోని పెద్దపీర్ల చావడి మటన్ మార్కెట్, స్లాటర్ హౌస్‌లపై అధికారులు దాడులు చేశారు. సుమారు 15 దుకాణాల్లోని ఫ్రీజర్లను తనిఖీ చేయగా, రోజులు తరబడి నిల్వ ఉంచిన మేకలు, పొట్టేళ్ల భాగాలు పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టిన స్థితిలో లభ్యమయ్యాయి. మొత్తం 500 నుంచి 1000 కిలోల వరకు మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్‌లో ధ్వంసం చేశారు.

విచారణలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు నాణ్యత లేని మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేసి హోటళ్లు, బిర్యానీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.