BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు: నూతన సీఐ గురుప్రకాశ్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 08:26 PM
5 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి. గురుప్రకాశ్ శుక్రవారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నూతన సీఐ గురుప్రకాశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తిరువూరు నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, నేరాలను సమర్థవంతంగా నియంత్రించడం, ప్రజలకు సత్వర పోలీసు సేవలు అందించడం వంటి అంశాలపై ఎమ్మెల్యే, సీఐ మధ్య చర్చ జరిగింది. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోలీసు శాఖ స్పందన తదితర విషయాలను కూడా వారు చర్చించారు.

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు ప్రజాప్రతినిధుల సహకారం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ సమావేశంలో మైలవరం ఏసీపీ రామచంద్రరావు, సబ్‌ ఇన్స్పెక్టర్లు శాతకర్ణి రాజు, కృష్ణారెడ్డి, గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు.