BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 08:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఆరోగ్య కేంద్రాల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:52 PM
54 వీక్షణలు

తిరువూరులో ఆరోగ్య కేంద్రాల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు గర్భిణీల సేవలు, మాతా శిశు సంరక్షణపై పరిశీలన

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు:

తిరువూరు పట్టణంలోని బెస్తబజారు 8వ సచివాలయ పరిధిలోని ఆరోగ్య సేవలను జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న ప్రసూతి సేవలు, హైరిస్క్ గర్భిణీల గుర్తింపు, రక్తహీనత నివారణ చర్యలు, ప్రసవానంతర సేవల అమలుపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు.

జిల్లా గణాంకాధికారి లక్ష్మోజీ, జిల్లా ప్రోగ్రాం అధికారి మహేశ్వరరావు, జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సింగ్ అధికారి రేణుక, సీహెచ్‌వో కృష్ణకుమారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించి ఆరోగ్య శాఖ పర్యవేక్షకులు రవి, శ్యామల, ఏఎన్‌ఎం రమాదేవి నుంచి వివరాలు సేకరించారు.

ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

అనంతరం మండలంలోని మునుకుళ్ళ ఆరోగ్య కేంద్రాన్ని కూడా జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీ చేసి ఆరోగ్య సేవల అమలును పరిశీలించింది.