BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 25 March 2026, 12:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఇంధన సంక్షోభం… పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 12:02 PM
198 వీక్షణలు

తిరువూరులో ఇంధన సంక్షోభం… పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇంధన కొరత తీవ్రంగా మారింది. పట్టణంలోని నాలుగు పెట్రోల్ బంకుల్లో మూడు బంకులు ఫ్యూయల్ లేక మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఒక రిలయన్స్ బంక్ ముందు భారీగా క్యూ కట్టిన వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెట్రోల్ బంకులు పూర్తిగా మూసివేస్తారన్న వదంతులు వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవాలని భావిస్తూ బంకుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఇక ఆయిల్ కంపెనీలు క్రెడిట్ సప్లై నిలిపివేయడంతో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడినట్లు సమాచారం. ఈ సమస్య త్వరగా పరిష్కరించకపోతే రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.