BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 08:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో సేవాస్ఫూర్తి కొత్త అడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:54 PM
141 వీక్షణలు

తిరువూరులో సేవాస్ఫూర్తి కొత్త అడుగు… డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ ప్రారంభం 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సేవా కార్యక్రమాలకు కొత్త ఊపు వచ్చింది. జన్మభూమి రోడ్‌లో జయకృష్ణ హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన “డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్” ను రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండటం ఎంత ముఖ్యమో పేర్కొంటూ, ఇలాంటి బ్లడ్ సెంటర్లు ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తిరువూరు ప్రాంత ప్రజలకు ఇది పెద్ద వరమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కంచర్ల ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పంతంగి శ్రీనివాసరావు, టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ప్రముఖ వైద్యులు డా. పెనుబల్లి నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పసుమర్తి వెంకటేశ్వరరావు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్థానికంగా అత్యవసర రక్త అవసరాలకు ఈ సెంటర్ ఒక నమ్మకమైన ఆధారంగా మారనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.