BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 13 May 2026, 10:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 10:09 PM
138 వీక్షణలు

మహబూబాబాద్‌లో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా తప్పు చేస్తే చట్టం ముందు శిక్ష అనివార్యమని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తాత్సారం చేయలేదని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామని వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కారణంగా కేసు నమోదు ప్రక్రియలో ఒక్క రోజు ఆలస్యం జరిగిందని అంగీకరించిన సీతక్క.. సిట్ ఏర్పాటు కాలయాపన కోసం కాదని, నిజానిజాలు బయటకు తీసుకురావడానికేనని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి స్థాయిలో ఉన్నా పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు మహిళలను గౌరవించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సీతక్క సూచించారు.

ఇదిలా ఉండగా, బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం. బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా, వ్యక్తిగత కారణాలతో ఈ నెల 15న హాజరవుతానంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు, సిట్ అధికారులకు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపినట్లు తెలిసింది.