BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 01 July 2026, 07:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుపాకీ నుంచి హలానికి.. మావోయిస్ట్ సభ్యురాలు కొత్త జీవితానికి నాంది

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:45 PM
94 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకప్పుడు చేతిలో తుపాకీ పట్టి అడవుల్లో సంచరించిన మావోయిస్ట్ సభ్యురాలు నేడు హలం పట్టి పొలం పనుల్లో నిమగ్నమై కనిపిస్తోంది.

చర్ల మండలం మారుమూల గిరిజన గ్రామం రాళ్పాపురానికి చెందిన పొడియం లక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి సాయుధ పోరాట బాట పట్టింది. అనంతరం మావోయిస్టు పార్టీలో అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసింది.

ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన లక్ష్మి ప్రస్తుతం తన గ్రామానికి చేరుకుని అమ్మమ్మ వద్ద ఉంటూ పోడు భూమిలో వ్యవసాయ పనులు చేస్తోంది. అలాగే అడవి ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనం సాగిస్తోంది.

ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల పునరావాస ప్యాకేజీని అందిస్తే శాశ్వత ఉపాధి ఏర్పాటుకు ఉపయోగించుకుంటానని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.