BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 11 January 2026, 06:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు

తెలంగాణ
11 Jan, 2026 - 06:33 AM
239 వీక్షణలు
  ఘనంగా వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు NTODAY NEWS: అమడగూరు రిపోర్టర్: రామాంజనేయులు అమడగూరు, స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు దొనకొండ రమణప్ప అన్నారు. ఆదివారం అమడగూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మండల వడ్డెర సంఘం ఆధ్వర్యంలో, పార్టీలకు అతీతంగా వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రమణప్ప మాట్లాడుతూ, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తొలి సాయుధ పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డె ఓబన్న అని తెలిపారు. 1807 జనవరి 11న కర్నూలు జిల్లా రేనాటి ప్రాంతంలో సంచార జాతికి చెందిన వడ్డెర కులంలో ఓబన్న జన్మించారని చెప్పారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అధికారులు, రేనాటి పాలెగాళ్ల మధ్య శిస్తుల వసూలు విషయంలో ప్రారంభమైన ఘర్షణలు క్రమంగా సాయుధ పోరాటాలుగా మారాయని వివరించారు. నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటంలో వడ్డె ఓబన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. వడ్డెర్లు, బోయలు, చెంచులతో కూడిన సుమారు 10 వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన మహోన్నత వ్యక్తి వడ్డె ఓబన్న అని కొనియాడారు. ఆయన ఆశయాలు, పోరాటాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వడ్డె ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఓబన్న జయంతికి డుమ్మా కొట్టిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అమడగూరులో జరిగిన వేడుకలకు మండలంలోని వివిధ శాఖల అధికారులు హాజరుకాలేదు. తహసీల్దార్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించినప్పటికీ, మండల స్థాయి అధికారులు గైర్హాజరుకావడంతో వారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస రెడ్డి, తెలుగు యువత నాయకులు శ్యామ్ బాబు నాయుడు, రామచంద్ర రెడ్డి, బొట్టు సుధాకర్, మంజుల లక్ష్మన్న, శివరాం, నాగరాజు, రమణ, భాస్కర్, ఉత్తప్ప, కాసుల శంకర, లక్ష్మీనారాయణ, వెంకటరమణ, ఆంజనేయులు, రామచంద్ర, వేమనారి, ఆదినారాయణ, శ్రీనివాసులు, శ్రీరాములు, వెంకటేష్, రామాంజులు, నారాయణ, వడ్డెర సోదరులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube