BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 19 November 2025, 09:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను హరించి వేస్తుంది

తెలంగాణ
19 Nov, 2025 - 09:41 AM
385 వీక్షణలు
కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను హరించి వేస్తుంది : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం NTODAY NEWS: చిట్యాల తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నిరంకుశ పాలన విముక్తి కోసం పోరాటం చేసిన పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఖమ్మంలో జరగబోయే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు గద్వాల నుండి ఖమ్మం వరకు జరుగుతున్న బస్సు యాత్ర బుధవారం రోజున నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా బస్సు యాత్రకు నకరేకల్ సిపిఐ నియోజకవర్గ సమితి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని, సిపిఐ కార్మిక హక్కుల కోసం పోరాటం చేసి వారి హక్కుల సాధనలో ఎంతో కృషి చేసిందన్నారు. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిందని, భూస్వామ్య వ్యవస్థ నుండి దున్నేవాడికే భూమిపై హక్కు ఉండే విధంగా పోరాటాలు సాగించారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం బీసీ 42% రిజర్వేషన్ల ను అడ్డుకొని బీసీల నోటి దగ్గర ఉన్న అన్నాన్ని లాగేసుకునే ప్రయత్నం బీజేపీ చేసిందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి కానీ బూటకపు ఎన్ కౌంటర్ పేరుతో మానవ హక్కులకు భంగం కలిగిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతుల వ్యతిరేక చట్టాలను చేసి కార్మికులకు, హర్షకులకు అన్యాయం చేస్తుందని , కార్మిక కర్షకుల హక్కుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడు పోరాటం చేస్తుందని ప్రతి ఒక్కరు వాటికోసం కలిసి రావాలని అన్నారు. ఈ బస్సు యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎన్ బాల నరసింహా, నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రావణ్ , ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్దే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జగన్, గీత పనివారిలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగ సైదులు , జిల్లా యాదయ్య, సిపిఐ చిట్యాల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube