BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 January 2026, 05:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

తెలంగాణ
19 Jan, 2026 - 05:15 AM
350 వీక్షణలు
సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: ధర్మారం ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతోందని తెలిపారు. జాతర నిర్వహణలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జాతర సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి కొరత లేకుండా బోరు బావులు, తాత్కాలిక నీటి ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా, శుభ్రత నిర్వహణకు ప్రత్యేక చర్యలు, రవాణా సౌకర్యాల మెరుగుదలతో పాటు వైద్య శిబిరాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో కలిసి సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతర పనుల సమీక్ష సమావేశంలో పాల్గొని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ మండలంలో సుమారు ఎనిమిది గ్రామాల్లో సమ్మక్క–సారలమ్మ జాతరలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #SammakkaSaralammaJathara #MedaramJathara #TelanganaFestivals #PublicSafety #DevotionalEvent #GovernmentArrangements #TelanganaNews #TempleFestival #PeopleFirst #CulturalHeritage Follow us on Website Facebook Instagram YouTube