BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 28 December 2025, 04:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

తెలంగాణ
28 Dec, 2025 - 04:36 AM
374 వీక్షణలు

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

NTODAY NEWS: జగిత్యాల  మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష – రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి, జగిత్యాల మరియు రాయికల్ మున్సిపాలిటీల పరిధిలో పలు ప్రభుత్వ పథకాల కింద జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం జగిత్యాల కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…  ధర్మపురి మున్సిపాలిటీతో పాటు జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల పరిధిలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు మున్సిపాలిటీల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రానున్న వేసవి కాలానికి ముందే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని, ఇప్పటికే పూర్తైన పనులను ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, డీఈఈలు, ఏఈఈలు, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube