BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందించడమే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
08 Apr, 2025 - 01:47 PM
56 వీక్షణలు
సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందించడమే ప్రభుత్వ లక్ష్యం-- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మర్యాల గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలంగాణ ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో నిరుపేద దళిత కుటుంబ సభ్యులతో సహా పంక్తి భోజనం NTODAY NEWS: బొమ్మలరామారం, ఏప్రిల్ 08 ఇప్పలపల్లి నరేందర్ జాయింట్ నల్గొండ జిల్లా బ్యూరో మండలంలోని మర్యాల గ్రామంలో మంగళవారం రోజున నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.మర్యాల గ్రామంలోని ప్రతి గల్లీ ప్రతి వాడలో గాంధీ,అంబెడ్కర్ చిత్రపటాలను, రాజ్యాంగన్నీ చేతిలో పట్టుకొని ప్రజలందరికి అవగాహన కల్పించారు.ఇదే సందర్భంలో సీసీ రోడ్డును ప్రారంభించి మరొక సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువల పై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు.అమిత్ షా అంబెడ్కర్ ని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ,అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులే ముఖ్యం అన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను కూడా కొనసాగిస్తుందన్నారు. కానీ బిఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక వ్యతిరేకమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతుందని అన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని చేస్తున్నారని మన గ్రామాలలో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా అధికారులతో మంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు అనంతరం రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం సన్న బియ్యంతో అన్నం తినాలని లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో మర్యాల గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబమైన కోరమైన అంజమ్మ యాదగిరి నివాసంలో మండల అధికారులు, నాయకులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం అందజేసిన సన్న బియ్యంతో పేద ప్రజల ఇంట్లో ప్రతి పండుగ చేసుకుంటున్నారని ఈరోజు వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సింగిర్తి మల్లేశం, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైస్ రాజేష్ పైలెట్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మండల కన్వీనర్ వెంకటేష్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయక్, మహిళా అధ్యక్షురాలు సునీత, ఎమ్మార్వో పి. శ్రీనివాసరావు, ఎంపీడీవో రాజా త్రివిక్రమ్, ఎంపీఓ శాలిని, ఆర్ ఐ వెంకట్ రెడ్డి,మండల అధికారులు, సి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు యాంజల కళ, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, చీర సత్యనారాయణ, మోకు మధుసూదన్ రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రశేఖర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామిడి శ్రావణ్ ప్రసాద్ రెడ్డి,జంగారెడ్డి,వెంకటేష్ గౌడ్,గంగాదేవి హనుమంతు, సింగిరెడ్డి జితేందర్ రెడ్డి, బుడుమ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube