BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 21 January 2026, 09:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

తెలంగాణ
21 Jan, 2026 - 09:12 AM
377 వీక్షణలు

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి: సీఐటీయూ పోస్టర్ విడుదల

NTODAY NEWS: అమడగూరు మండలం రిపోర్టర్: రామాంజనేయులు అమడగూరు మండల కేంద్రంలో సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి ఉపాధి ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐటీయూ మండల కన్వీనర్ మద్దె కేశవ, ఓడీసీ ట్రాన్స్‌పోర్ట్ జిల్లా ఉపాధ్యక్షుడు కుళ్లాయప్ప మాట్లాడుతూ—ఉపాధిని దెబ్బతీసే కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని, గ్రామీణ కార్మికుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు నాగరాజు, బాబావలి మాట్లాడుతూ—2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వామపక్ష పార్టీల కృషితో అమలులోకి వచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా కూలీలు, పేద రైతులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, అగ్రకులాలకు చెందిన పేదలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలవుతుందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ఒత్తిడితో ఈ పథకాన్ని నీరుగార్చేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తోందని విమర్శించారు. పాత చట్టంలో నిధుల్లో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం భరించేదని, కొత్త చట్టంతో రాష్ట్రాలపై భారం పెరిగి 40 శాతం భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందుకే ఈ కొత్త చట్టాన్ని సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దె కేశవ, కుళ్లాయప్ప, వేణుగోపాల్, రమేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. #MGNREGA #SaveMGNREGA #EmploymentGuarantee #RuralEmployment #WorkersRights #CITU #SocialJustice #LabourMovement #RightToWork Follow us on Website Facebook Instagram YouTube