BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 24 January 2026, 07:50 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

పీఎం స్వనిధి 2.0 పథకాన్ని వినియోగించుకోవాలి

తెలంగాణ
24 Jan, 2026 - 07:50 PM
305 వీక్షణలు
అర్హులైన ప్రతి వీధి వ్యాపారి పీఎం స్వనిధి 2.0 పథకాన్ని వినియోగించుకోవాలి గొల్లప్రోలు బీజేపీ అధ్యక్షుడు చిట్టా మధు NTODAY NEWS: కాకినాడ జిల్లా – గొల్లప్రోలు ప్రతినిధి భోర శివారెడ్డి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి 2.0 పథకాన్ని అర్హత ఉన్న ప్రతి వీధి చిరు వ్యాపారి సద్వినియోగం చేసుకోవాలని గొల్లప్రోలు బీజేపీ అధ్యక్షుడు చిట్టా మధు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం అర్బన్, గొల్లప్రోలు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వీధి చిరు వ్యాపారుల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వీధి వ్యాపారులను ఆదుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకాన్ని ఇప్పుడు 2030 వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. పీఎం స్వనిధి 2.0 పథకం ముఖ్యాంశాలు: ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు మొదటి విడత రుణం: రూ.10,000 రెండో విడత రుణం: రూ.20,000 మూడో విడత రుణం: రూ.50,000 సకాలంలో రుణం చెల్లిస్తే 7% వడ్డీ రాయితీ డిజిటల్ లావాదేవీలు చేస్తే నెలకు రూ.100 క్యాష్‌బ్యాక్ ULB సర్టిఫికెట్ / ఐడీ కార్డు కలిగిన వారు అర్హులు అర్హులైన వీధి వ్యాపారులు తమ సమీపంలోని సేవా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ఆన్‌లైన్ పీఎం స్వనిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. #PMSVANidhi #PMSVANidhi2 #StreetVendors #SelfReliantIndia #AtmaNirbharBharat #SmallBusinessSupport #CentralGovernmentSchemes #BJP #KakinadaDistrict #Gollaprolu Follow us on Website Facebook Instagram YouTube