BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 09 February 2026, 07:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

తెలంగాణ
09 Feb, 2026 - 07:41 AM
246 వీక్షణలు
చిట్యాల అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే: ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ NTODAY NEWS: చిట్యాల చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కనకదుర్గ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిట్యాల అభివృద్ధికి సంబంధించి రూ.15 కోట్ల విలువైన జీవో ఆర్డర్ కాపీని కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్దే ప్రజలకు చూపించామని తెలిపారు. అయినా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యకు నిధులు మంజూరు చేశామని, అమృత్ స్కీమ్ కింద రూ.12.50 కోట్లతో పనులకు శంకుస్థాపన జరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.75 లక్షలు, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మరో రూ.32 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గత పాలకుల హయాంలో పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని విమర్శించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. చిట్యాల పట్టణంలో సుమారు 900 ఇళ్లను పేదలకు కేటాయిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు చేపడతామని, 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా అండర్‌పాస్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని, ప్రతి వార్డులో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కనకదుర్గ అమ్మవారి కల్యాణ మండపం నిర్మాణానికి రూ.5 లక్షలు, బతుకమ్మ కుంట అభివృద్ధికి రూ.2.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చిట్యాల అభివృద్ధి, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలు మరోసారి చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా నాయకులు పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, మారగోని ఆంజనేయులు, పాటి మాధవరెడ్డి, 12 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు, మండలంలోని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. #Chityala #CongressParty #MunicipalElections #DevelopmentAgenda #VemulaVeeresham #TelanganaPolitics #UrbanDevelopment #PublicWelfare Follow us on Website Facebook Instagram YouTube