BREAKING
thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్
Date of Publish : 27 February 2026, 06:43 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

తెలంగాణ
27 Feb, 2026 - 06:43 PM
424 వీక్షణలు
ఎన్‌పిఆర్‌డీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా పెన్షన్ పెంపు, బడ్జెట్ నిధుల పెంపు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం రామన్నపేట, ఫిబ్రవరి 27, 2026: వికలాంగుల హక్కుల సాధన, ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యాలతో ఎన్‌పిఆర్‌డీ 16వ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ తెలిపారు. రామన్నపేట మండలం జనంపెళ్లి–కక్కిరేణి గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ పెంపు, కేంద్ర–రాష్ట్ర బడ్జెట్లలో నిధుల కేటాయింపులు పెంపు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమాలను ఉదృతం చేస్తామని తెలిపారు. ప్రధాన డిమాండ్లు వికలాంగుల పెన్షన్ పెంపు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిధుల కేటాయింపులు పెంపు 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సమగ్ర అమలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల అమలు ప్రత్యేక క్రీడా విధానం రూపొందింపు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు చట్టబద్ధ చర్యలు వికలాంగుల హక్కుల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు తగినంతగా లేకపోవడం వల్ల సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. యూడీఐడీ కార్డుల జారీ, ప్రభుత్వ కార్యాలయాల యాక్సెసిబిలిటీ, ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హామీల అమలులో జాప్యం జరుగుతోందని, వికలాంగుల సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు మరియు గ్రామ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. #NPRD #DisabilityRights #PensionHike #BudgetAllocation #ReservationPolicy #SocialJustice #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube