www.ntodaynews.com
సాగువిధానాల మార్పుతోనే రాష్ట్ర వ్యవసాయరంగానికి.. రైతాంగానికి లబ్ధి
తెలంగాణ
సాగువిధానాల మార్పుతోనే రాష్ట్ర వ్యవసాయరంగానికి.. రైతాంగానికి లబ్ధి : ప్రత్తిపాటి
NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా..
• ఐదు మంత్రాలతో రాష్ట్ర వ్యవసాయరంగాన్ని లాభాల పట్టిస్తేనే రైతులకు మేలు
• సాగు విధానాలు మార్చి, రైతాంగానికి మేలు చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన.
• రైతు సంతోషం కోసమే ఆర్థిక ఇబ్బందుల్ని లక్ష్యపెట్టకుండా ముఖ్యమంత్రి సాగుకు అండగా ఉంటున్నారు.
• పీఎం కిసాన్ - అన్నదాతా సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో మాజీమంత్రి ప్రత్తిపాటి.
సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన అన్నదాతా సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రప్రభుత్వ సాయానికి తోడు అదనంగా ఆర్థికసాయం అందిస్తున్నారని, అప్పులు, వడ్డీలు ఇతరత్రా ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతలకు న్యాయం చేస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం ఆయన చిలకలూరిపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో రైతులు, కూటమినేతలు, కార్యకర్తల సమక్షంలో నిర్వహించిన పీఎం కిసాన్ – అన్నదాతా సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమచేశారు. రైతులు అన్నదాతా సుఖీభవ కార్యక్రమాన్ని వీక్షించేలా మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయించిన ప్రత్తిపాటి వారితో కలిసి కడప జిల్లా పెండ్లిమర్రిలో ముఖ్యమంత్రి పాల్గొన్న అన్నదాతా సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమాన్ని కాసేపు వీక్షించారు. రెండో విడత అన్నదాతా సుఖీభవ కింద నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 21,669 మంది రైతులకు 14.13 కోట్లు అందించినట్టు ప్రత్తిపాటి చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సాగువిధానాలు మారితేనే రాష్ట్ర వ్యవసాయరంగం సుదీర్ఘకాలం నిలుస్తుందని, రైతులకు లాభాలు వస్తాయని, ఈ దిశగా ముఖ్యమంత్రి రైతాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. దానిలో భాగంగా పంచ (ఐదు) మంత్రాల విధానాన్ని కూటమిప్రభుత్వం రైతాంగానికి పరిచయం చేస్తోందన్నారు.
ఐదు విధానాలతో అధిక ఆదాయం.. వ్యవసాయరంగ ప్రగతి
నీటి భధ్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, సాగులో సాంకేతికత వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే 5 విధానాల్ని రైతాంగం అమలుచేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ రైతన్నలు మంచి లాభాలు పొందుతారని, రాష్ట్ర వ్యవసాయరంగం వేగంగా ప్రగతిబాట పడుతుందని ప్రత్తిపాటి సూచించారు. సాగుతీరు మారాలి.. అన్నదాత బతుకు మారాలన్నదే చంద్రబాబు లక్ష్యమని, అప్పుడే అన్నిరంగాలకు ధీటుగా రాష్ట్ర వ్యవసాయరంగం ఉజ్వలంగా పురోగమిస్తుందన్నారు.
చంద్రబాబు నాయకత్వం ప్రపంచ దిగ్గజ సంస్థలను ఏపీవైపు చూసేలా చేసింది
విశాఖ సీఐఐ సమ్మిట్ ద్వారా చంద్రబాబు నాయకత్వం ప్రపంచ దిగ్గజ సంస్థలు, కంపెనీలను రాష్ట్రం వైపు చూసేలా చేసిందన్న ప్రత్తిపాటి, 13 లక్షల కోట్లకు మించిన పెట్టుబడుల ఆకర్షణతో 16లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు బీజం పడిందన్నారు. ప్రభుత్వం పరిశ్రమలు, సంస్థలతో చేసుకున్న ఒప్పందాల్లో ప్రతి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వడం, 3 ప్రాంతాల్లో సమానంగా పెట్టుబడులు పెట్టేలా చూడటం జరిగిందన్నారు.
డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం వల్లే రాష్ట్రం వేగంగా ప్రగతి సాధిస్తోందని, ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని బలంగా విశ్వసించినప్పుడే ఏపీ దేశానికే తలమానికంగా నిలుస్తుందని ప్రత్తిపాటి చెప్పారు. కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పుడే అన్నివర్గాల ప్రజల భవిష్యత్ బాగుంటుం దన్నారు. విషప్రచారంతో కూటమిప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వైసీపీ, జగన్ ఆలోచనల్ని ప్రజలు నిర్ద్వందంగా తిప్పికొట్టాలని ప్రత్తిపాటి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, నియోజకవర్గ అధ్యక్షులు అంబటి సోంబాబు, కందుల రమణ, ఇనగంటి జగదీష్, కూటమి ముఖ్య నాయకులు, అగ్రికల్చర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube