BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 21 January 2026, 09:22 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించిన తుని టౌన్ పోలీసులు

తెలంగాణ
21 Jan, 2026 - 09:22 AM
249 వీక్షణలు
గంటల వ్యవధిలో మర్చిపోయిన బంగారు నగల బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించిన తుని టౌన్ పోలీసులు  NTODAY NEWS:  తుని మల్లవరం గ్రామానికి చెందిన పాలిక దేవి కాకినాడ వెళ్లేందుకు తుని బస్టాండ్‌కు ఆటోలో వచ్చి బస్సు కోసం వేచి ఉన్నారు. అక్కడ నుంచి ఆలస్యం అవుతుందని, తన ఇద్దరు పిల్లలతో కలిసి గొల్ల అప్పారావు సెంటర్‌కు వెళ్లేందుకు మరోసారి ఆటో ఎక్కారు. ఈ క్రమంలో ఆమె బంగారు నగలు, నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటో వెనుక భాగంలో పెట్టి, గొల్ల అప్పారావు సెంటర్ వద్ద దిగారు. అయితే ఆటోలోనే బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ మర్చిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే తుని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ సమాచారం తెలుసుకున్న తుని టౌన్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆమె దిగిన ఆటోను గుర్తించి, ఆటో నంబర్ ద్వారా డ్రైవర్ అనిశెట్టి వీరబాబును సంప్రదించారు. ఆటోను తనిఖీ చేసిన డ్రైవర్, బ్యాగ్ ఆటో వెనుక భాగంలోనే ఉన్నట్లు గుర్తించి, దానిని తుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. బ్యాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు మొత్తం సురక్షితంగా ఉన్నట్లు బాధితురాలు నిర్ధారించారు. బంగారు నగల విలువ సుమారు రూ. 3,50,000గా అంచనా వేశారు. నిజాయితీగా బ్యాగ్‌ను అప్పగించిన ఆటో డ్రైవర్ అనిశెట్టి వీరబాబును పోలీసులు సత్కరించారు. ఈ కేసును గంటల వ్యవధిలో చేదించిన పోలీసు సిబ్బందిని బిందు మాధవ్ మరియు డి. శ్రీహరి రాజు అభినందించారు. #TuniPolice #HonestAutoDriver #LostAndFound #PoliceAppreciation #QuickAction #CommunityTrust #PublicSafety Follow us on Website Facebook Instagram YouTube