BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 03 February 2026, 04:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దేశ సంపూర్ణ వికాసానికి కేంద్ర బడ్జెట్ బలమైన పునాది

తెలంగాణ
03 Feb, 2026 - 04:43 AM
161 వీక్షణలు
దేశ సంపూర్ణ వికాసానికి కేంద్ర బడ్జెట్ బలమైన పునాది NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిథి, బోర శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రోత్సాహకంగా 2026 కేంద్ర బడ్జెట్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ వ్యాఖ్యలు దేశ సంపూర్ణ వికాస లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, సుంకాల యుద్ధాల మధ్య ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరమైన అభివృద్ధి బాటలో నడిపించేలా ఉందన్నారు. ఈ బడ్జెట్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా దేశం గరిష్ట లబ్ధి పొందేందుకు బలమైన పునాదులు వేసిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా డేటా సెంటర్లకు హబ్‌గా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్ ఒక వరంలా మారిందన్నారు. 2047 వరకు డేటా సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం టాక్స్ హాలిడే ప్రకటించడం రాష్ట్రానికి ఎంతో లాభదాయకమని చెప్పారు. ఇప్పటికే మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో మైక్రోసాఫ్ట్, బ్రూక్‌ఫీల్డ్, రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందాలు కుదుర్చుకుందని, ఈ బడ్జెట్ ద్వారా మరిన్ని అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. EVలు, రక్షణ పరికరాలు, ఆధునిక సాంకేతిక రంగాలకు అవసరమైన 17 రకాల అరుదైన భూగర్భ ఖనిజాల వెలికితీత, పరిశోధన కోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటును కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడం రాష్ట్రానికి కీలకమని చెప్పారు. దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించబడతాయని పేర్కొన్నారు. వ్యవసాయం, మత్స్యకార రంగాలకు ఇచ్చిన ప్రోత్సాహకాలు రాష్ట్ర రైతాంగానికి మేలు చేస్తాయని తెలిపారు. చేపలు, రొయ్యల ఎగుమతులకు ప్రోత్సాహకాలు, కొబ్బరి, జీడిపప్పు పరిశ్రమల అభివృద్ధికి ప్రకటించిన పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని అన్నారు. అరకు లోయ పర్యాటక అభివృద్ధి, పులికాట్ సరస్సులో పక్షుల అభయారణ్య అభివృద్ధికి బడ్జెట్‌లో చోటు కల్పించడం రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని తెలిపారు. కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో రూ.1000 కోట్లతో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుతో పాటు, సెమీకండక్టర్ మిషన్‌కు రూ.40,000 కోట్లు కేటాయించడం పరిశ్రమల అభివృద్ధికి కీలకమన్నారు. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లడం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. పూర్వోదయ పథకంలో భాగంగా ఈస్ట్ కోస్ట్ కారిడార్ అభివృద్ధి, పర్యాటక రంగానికి ప్రత్యేక చర్యలు, ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుతో రాష్ట్రానికి సమగ్ర లాభం చేకూరుతుందని రవికిరణ్ అన్నారు. 2047 నాటికి భారత్‌ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఈ కేంద్ర బడ్జెట్ బలమైన పునాదిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. #UnionBudget2026 #IndiaDevelopment #AndhraPradeshGrowth #EconomicGrowth #InfrastructureDevelopment #DataCenterHub #RareEarthCorridor #SemiconductorMission #TourismDevelopment #ViksitBharat2047 Follow us on Website Facebook Instagram YouTube