BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 11 January 2026, 03:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నిత్య జలాభిషేకంతో దర్శనమిచ్చే స్తంభంపల్లి వేంకటేశ్వరుడు

తెలంగాణ
11 Jan, 2026 - 03:41 AM
228 వీక్షణలు

అద్భుతం.. నిత్య జలాభిషేకంతో దర్శనమిచ్చే స్తంభంపల్లి వేంకటేశ్వరుడు

వందల ఏళ్ల చరిత్ర.. ధనస్సు ధరించిన విశిష్ట రూపం.. మాఘ మాస బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న పురాతన క్షేత్రం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ ప్రకృతి ఒడిలో, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య వెలసిన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. సుమారు 600 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన క్షేత్రం తనదైన విశిష్టతలతో ప్రసిద్ధి చెందింది. విలక్షణ రూపం.. అద్భుత క్షేత్రం సాధారణంగా వేంకటేశ్వరుడు శంఖు–చక్రధారిగా దర్శనమిస్తారు. అయితే ఈ క్షేత్రంలోని స్థలపురాణం ప్రకారం, స్వామివారు అమ్మవారితో కలిసి ఇక్కడ ధనస్సు (విల్లు) ధరించిన ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడి మరో విశేషం—నిత్య జలాభిషేకం. స్వామివారు ఎల్లప్పుడూ జలాభిషేకంతోనే కొలువుదీరడం భక్తులకు అపూర్వ అనుభూతిని కలిగిస్తుంది. స్వామివారి వాహనంగా గుర్రం ఉండటం, క్షేత్రపాలకుడిగా ఆంజనేయస్వామి కొలువుదీరడం ఈ ఆలయ ప్రత్యేకతలను మరింత పెంచుతున్నాయి. మాఘ మాసంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మాఘ మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు కన్నులపండుగగా సాగుతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవాల వేళ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడుతుంది. దాతలకు విన్నపం ఈ పురాతన ఆధ్యాత్మిక క్షేత్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే దాతలు, ఆధ్యాత్మిక చింతన గల వారు క్రింది నంబర్‌ను సంప్రదించవచ్చు: 📞 89784 87185 (సాయికృష్ణ అవ్వ) పురాతన సంస్కృతిని, ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడుకుందాం.. స్వామి కృపకు పాత్రులవుదాం Follow us on Website Facebook Instagram YouTube