జీడబ్ల్యూఎంసీలో గ్రూప్–1 అధికారుల మూడు రోజుల శిక్షణ పూర్తి
తెలంగాణ
/
వరంగల్
కమిషనర్ టీ. వెంకన్నను మర్యాదపూర్వకంగా కలిసిన తోట సోని, జి. రాహుల్
వరంగల్ | ఎన్ టుడే న్యూస్:
2025 గ్రూప్–1 పరీక్షల ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లుగా నియమితులైన తోట సోని, జి. రాహుల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో మూడు రోజుల శిక్షణను పూర్తి చేసుకున్నారు.
శిక్షణ అనంతరం వారు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిపాలనకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంపొందించుకున్న అధికారులను కమిషనర్ అభినందించారు.