BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 13 February 2026, 07:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

తెలంగాణ
13 Feb, 2026 - 07:58 AM
213 వీక్షణలు
శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు NTODAY NEWS: శ్రీశైలం/ నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల, శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత దృష్ట్యా విస్తృత భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ పుణ్యక్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో సుమారు 1,782 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బందోబస్తును 10 సెక్టార్లుగా విభజించి, మ్యాప్ ఆధారంగా ప్రతి సెక్టార్‌లో చేపట్టాల్సిన విధులపై సవివరంగా వివరించారు. నియమించిన సిబ్బంది వివరాలు సివిల్ పోలీస్ అధికారులు, సిబ్బంది – 1,614 మంది అదనపు ఎస్పీలు – 11 డీఎస్పీలు – 24 సీఐలు – 78 ఎస్‌ఐలు – 132 ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు – 303 కానిస్టేబుళ్లు – 568 మహిళా కానిస్టేబుళ్లు – 88 హోమ్ గార్డులు – 386 మహిళా హోమ్ గార్డులు – 30 ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది – 34 మంది, 3 ఆర్ఎస్ఐలు స్పెషల్ పార్టీలు – 24 మంది, 3 ఆర్ఎస్ఐలు బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి ముగింపు వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సిబ్బందికి ఆదేశించారు. లడ్డూ కౌంటర్ల వద్ద క్యూలైన్లు సజావుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ రద్దీ పెరిగే నేపథ్యంలో వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. #Srisailam #MahaShivaratri #Nandyal #PoliceBandobast #APPolice #TempleSecurity #SrisailamTemple #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube