BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 05:30 pm
Posted by : కూనురు మధు

ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Jun, 2026 - 05:30 PM
182 వీక్షణలు

ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని కొనియాడారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ఈ కమిటీ పారదర్శకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా జూన్ 4న జరగబోయే 'కె. కేశవరావు ప్రత్యేక కమిటీ' సమావేశంలో విధివిధానాలను త్వరగా ఖరారు చేసి, ఉద్యమకారుల గుర్తింపుపై ప్రభుత్వం త్వరితగతిన అధికారిక ప్రకటన (డిక్లరేషన్) చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలు, మేధావులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగుల త్యాగాలకు తగిన గౌరవం దక్కినప్పుడే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుందని, ఈ నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని పల్లపు బుద్ధుడు పేర్కొన్నారు.