BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 02 July 2026, 06:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉపాధి శ్రామికులకు శుభవార్త.. పెరిగిన కూలీ, 125 రోజులకు పెరిగిన పనిదినాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
94 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం కింద పనిచేసే గ్రామీణ శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఉపాధి కూలీల రోజువారీ వేతనాన్ని పెంచడంతో పాటు, పనిదినాలను కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు రోజుకు రూ.300గా ఉన్న వేతనాన్ని తొలుత రూ.307కు పెంచిన ప్రభుత్వం, తాజాగా మరోసారి సవరిస్తూ రూ.312గా నిర్ణయించింది. అలాగే, ప్రస్తుతం అమల్లో ఉన్న 100 రోజుల ఉపాధి హామీ పనులను 125 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనులు తగ్గిపోయే వర్షాకాలం, ఇతర నిరుద్యోగ సమయాల్లో ఈ అదనపు 25 రోజుల పని శ్రామికులకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది.

పని దినాలు పెరగడం, కూలీ రేటు పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసాను మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి కూడా దోహదపడనుంది.

ఈ నిర్ణయంపై ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న చర్య తమ కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.