BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 31 May 2026, 07:00 pm
Posted by : కూనురు మధు

ఉరుమడ్ల లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
31 May, 2026 - 07:00 PM
562 వీక్షణలు

పూర్వ విద్యార్థులు తమ కుటుంబాలను వృద్ధి చేసుకుంటూనే, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జడ్పీహెచ్ఎస్ ఉరుమడ్ల మాజీ ప్రధానోపాధ్యాయులు రంగరాజు లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉరుమడ్ల గ్రామంలోని ఎస్.వి. గార్డెన్‌లో 1992-2002 బ్యాచ్‌కు చెందిన 1 నుండి 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 

​ముఖ్య అతిథిగా  రంగరాజు లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాలు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను, స్నేహాన్ని గుర్తుచేసుకునే అద్భుత అపురూపమైన సమయమని కొనియాడారు. అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కుకుడాల గోవర్ధన్  మాట్లాడుతూ ఉరుమడ్ల పాఠశాల ప్రారంభమై  యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలోనే అర్థ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ద్వారానే పేదలకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని, పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) పెంపునకు కృషి చేయాలని కోరారు. ఆపదలో ఉన్న తోటి స్నేహితులను ఆదుకోవడమే నిజమైన స్నేహ బంధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. గతంలో పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు చొల్లేటి యోగేంద్రనాథ్, చోల్లేటి పాండు రంగాచారి, వడ్డెగాని యాదగిరి, యం.డి పాషా, కరామతుల్లా, యన్.శ్యాంసుందర్, వి.రవీందర్, కే.నారాయణ, చొల్లేటి వెంకట నరసింహాచారి, జి. శంబయ్య, పి.నోములు, కే.అనంత రెడ్డి, సుంకరి సంధ్యా రాణి, ఉయ్యాల యాదయ్య, సాగర్ల లింగయ్య, గౌరీ శంకర్ తదితరులను పూర్వ విద్యార్థులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో 2001-2002 బ్యాచ్ నిర్వాహకులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.