BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 February 2026, 01:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

యూరియా బుకింగ్ యాప్ రద్దు చేయాలి

తెలంగాణ
28 Feb, 2026 - 01:12 AM
234 వీక్షణలు
యూరియా బుకింగ్ యాప్ రద్దు చేయాలి: సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం పాత విధానంలోనే ఎరువుల సరఫరా చేయాలని డిమాండ్ బొమ్మలరామారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్‌ను రద్దు చేసి, పాత విధానంలోనే ఎరువుల సరఫరా కొనసాగించాలని సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం డిమాండ్ చేశారు. మండలంలోని మర్యాల గ్రామంలో దేశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త యాప్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎరువులు సకాలంలో అందకపోతే పంటలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే దేశీయ రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, యూరియా యాప్‌ను రద్దు చేసి పాత విధానంలోనే ఎరువులు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి ముద్దం మధుసూదన్ రెడ్డి, ప్యారారం వెంకటేష్, దేవేందర్, బండ కొమురయ్య, మంద రాజు, నల్లగొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. #Bommalaramaram #CPM #FarmersIssues #UreaApp #AgriculturePolicy #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube