BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 April 2026, 06:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రాం 119వ జయంతి ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 06:44 PM
159 వీక్షణలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి ఘనంగా

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత దేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రాం చేసిన సేవలు అపారమని కొనియాడారు. ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల వైస్ ఎంపీపీ, ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చాట్ల రాబర్ట్, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, జిల్లా ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ గుడిసె ప్రభాకర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ రాము (రాజేష్), మండల యూత్ అధ్యక్షుడు గుంటక వంశీకృష్ణ రెడ్డి, శ్రీరాంపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరమల్ల వెంకట్రామారావు (బాలు), పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ అలవాల శ్రీనివాస్ రెడ్డి, రెడ్డిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు పైడమర్ల శ్రీనివాసరెడ్డి, రెడ్డిగూడెం ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లాది బాబు, చిప్ చెన్నకేశవరావు, చింతరాల రాంబాబు, శనగల గోపి రెడ్డి, బత్తుల వీరబాబు, కట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొని బాబు జగజ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.