BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 01 July 2026, 07:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:45 PM
99 వీక్షణలు

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ‘మావిగన్ వర్సెస్ అమరావతి’ అజెండాతోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల అమరావతికి ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ పేరుతో నూతన రాజధాని కారిడార్ ప్రతిపాదనను జగన్ ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మావిగన్ అజెండాపై తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని, ఇదే తమ ఎన్నికల నినాదమని తెలిపారు.

"మావిగన్‌కు మేము కట్టుబడి ఉన్నాం. ప్రజలకు మా వైఖరిని వివరిస్తాం. మాకు మద్దతు ఇచ్చే ప్రజలు మాకే ఓటు వేస్తారు. ప్రజల మద్దతు ఎవరికుందో ఎన్నికల్లో తేలిపోతుంది" అని జగన్ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో ‘అమరావతి నమూనానా? లేక మావిగన్ అజెండానా?’ అనే అంశంపైనే ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని ఆయన అన్నారు. ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని, ఎవరి విధానానికి ప్రజలు మద్దతు ఇస్తారో ఎన్నికల ఫలితాల్లో స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు.

జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం హాట్‌టాపిక్‌గా మారింది. రానున్న ఎన్నికల్లో అమరావతి అభివృద్ధి, మావిగన్ ప్రతిపాదన ప్రధాన రాజకీయ చర్చాంశాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.