BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 24 July 2026, 08:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం: కొలికపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 08:54 PM
65 వీక్షణలు

తిరువూరు, జూలై 24: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే వారి భవిష్యత్ లక్ష్యాలు, ఉన్నత విద్యపై ఆసక్తిని తెలుసుకున్నారు. జీవితంలో విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమ, సమయపాలన ఎంతో అవసరమని సూచించారు. ఉపాధ్యాయులు బోధించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలని, తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ మంచి నడవడికతో ఎదగాలని, అనవసర అలవాట్లు, అల్లరికి దూరంగా ఉండి చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించేలా ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, ఇతర విద్యా సౌకర్యాలు అందిస్తున్నట్లు వివరించారు. ఇటీవల విడుదలైన 'తల్లికి వందనం' పథకం నిధులను విద్యార్థుల విద్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహించాలని, వారి ప్రతిభ, అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. ఇంటి వద్ద చదువుకు అనుకూల వాతావరణాన్ని కల్పించడంతో పాటు ఉపాధ్యాయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పిల్లల విద్యా ప్రగతిని తెలుసుకోవడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలు, నాణ్యమైన విద్య అందించే చర్యలను వివరించిన ఎమ్మెల్యే, విద్యే సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.