BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 20 July 2026, 08:15 pm
Posted by : V శ్రీనివాస్

విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం పెట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదా...?

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jul, 2026 - 08:15 PM
208 వీక్షణలు

విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం పెట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదా...?

  • మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు - 
  • సీఐటీయు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి
  • డిఈఓ కార్యాలయం సుపర్డెంట్ వేణు గారికి వినతి 
  • అబ్బోజు రమణ దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు 

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ( CITU ) ఆధ్వర్యంలో సోమవారం రోజున మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిఈఓ కార్యాలయం సుపర్డెంట్ వేణు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *అబ్బోజు రమణ దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు* మాట్లాడుతూ....గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం వంట చేసి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులను పాఠశాలల నుండి వెళ్లగొట్టడానికి,విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుంది.

గత సం,,ఈ పథకాన్ని హనుమకొండ జిల్లాలో ప్రవేశపెట్టారు.ఈ పథకం నిర్వాహకులు పెట్టేటువంటి భోజనం రుచికరంగా లేదని, నాణ్యతగా లేదని విద్యార్థులు తినలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసింది. *దాగం రాజారాం* మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ... కనీస వేతన ఇవ్వకుండా కార్మికుల తోటి వెట్టిచాగరి చేయించుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు 10,000/- వేతనం ఇవ్వాలన్నారు.

*ఎండి.రఫియా, ఎండి కరీమా* తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ..60 సం,లు వయసు పైబడిన కార్మికులను అకారణంగా తొలగించడం సరికాదన్నారు. అలా తొలగించే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డుమెంట్ బెనిఫిట్ కింద రెండు లక్షల రూపాయల చెల్లించాలన్నారు.

  రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు , స్పందించి మధ్యాహ్న భోజన పథకాన్ని యధావిధిగా కార్మికుల ద్వారానే కొనసాగించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోమస ప్రకాష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాస్ , అంబటి లక్ష్మణ్ , మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం లక్ష్మి, సరిత, ఉమా, రమాదేవి, సవిత, కాంతమ్మ, సేపూరి లక్ష్మి, బుచ్చమ్మ, వరలక్ష్మి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు