BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 07:38 am
Posted by : PAMMI NAVEENKUMAR

విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
11 Aug, 2026 - 07:38 AM
69 వీక్షణలు

విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి

కొత్తపేట నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ రావులపాలెం నుంచి కొత్తపేట వరకు హోరెత్తిన నిరసన..అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం డిగ్రీ కాలేజ్ నుంచి కొత్తపేట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత ఈ ర్యాలీలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం కొత్తపేట చేరుకున్న నాయకులు, కార్యకర్తలు కొత్తపేట సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.