BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 25 July 2026, 08:30 am
Posted by : కూనురు మధు

విద్యుత్ బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ
/ నల్గొండ
25 Jul, 2026 - 08:30 AM
40 వీక్షణలు

విద్యుత్ బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి 

నల్గొండ డివిజన్ పరిధిలోని విద్యుత్ బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఈఈకి విజ్ఞప్తి చేశారు.​శుక్రవారం నల్గొండ డివిజన్ డీఈఈ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్. విద్యాసాగర్ ను  డివిజన్ సెక్రటరీ దామనూరు ఈశ్వర్ అధ్యక్షతన సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాన్ని  అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

​అనంతరం విద్యుత్ బీసీ ఉద్యోగుల సమస్యలపై డీఈఈ తో క్షుణ్ణంగా చర్చించారు. దీనిపై స్పందించిన డీఈఈ విద్యాసాగర్, ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉంటూ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంజి వెంకన్న, జిల్లా కార్యదర్శి ఊట్కూరి గిరి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపికృష్ణ, డివిజన్ అధ్యక్షులు డి. సత్యనారాయణ, డివిజన్ కార్యదర్శి డి. ఈశ్వర్, జిల్లా ట్రెజరర్ జి. రామ్మూర్తి, జాయింట్ సెక్రటరీ వై. విశ్వం, డివిజన్ వర్కిం ప్రెసిడెంట్ బి. సైదులు, సత్యనారాయణ  టౌన్-1 ఏ  ఈ హరికృష్ణ పాల్గొన్నారు.