BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 15 July 2026, 08:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విధి వంచిన పోలీసు అధికారి.. రోడ్డు ప్రమాదంలో సీఎం భద్రతా విభాగం గన్‌మెన్ కిరణ్ మృతి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:52 PM
205 వీక్షణలు

హైదరాబాద్, జూలై 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ కిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.

2009 బ్యాచ్‌కు చెందిన కిరణ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి తన విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో గుర్తింపు పొందారు. వివిధ కీలక ప్రజాప్రతినిధుల భద్రతా విభాగంలో సేవలందించిన ఆయన, ప్రస్తుతం ముఖ్యమంత్రి భద్రతా బృందంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

గతంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేశారు. అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి భద్రతా బృందంలో కూడా సేవలందించారు. తన క్రమశిక్షణ, సమర్థతతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందిన కిరణ్, వృత్తిపరంగా మంచి పేరు సంపాదించుకున్నారు.

సిద్దిపేట సమీపంలోని గ్రామానికి చెందిన కిరణ్, సిద్దిపేటలో డిగ్రీ విద్య పూర్తిచేసి పోలీసు శాఖలో చేరారు. విద్యార్థి దశ నుంచే చురుకైన వ్యక్తిత్వం కలిగిన ఆయన, సహచరులతో ఆప్యాయంగా మెలిగే స్వభావం వల్ల అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఎలాంటి ఒత్తిడి పరిస్థితుల్లోనూ చిరునవ్వుతో విధులు నిర్వహించేవారని సహోద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు.

చిన్న వయసులోనే కిరణ్ మృతి చెందడం పట్ల పోలీసు అధికారులు, సహచరులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.