BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 09:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయ దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజ ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
112 వీక్షణలు

కడప, జూన్ 9:

“అమ్మా అని పిలిస్తే, నేనున్నా” అని పలికే చల్లని తల్లి మన కడప శ్రీ విజయదుర్గా దేవి సన్నిధిలో మంగళవారం రాహుకేతు పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు.

వేకువ జామున పంచామృత అభిషేకం ద్వారా అమ్మవారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం అందజేయగా, మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు రాహు కాల పూజ నిర్వహించారు. గ్రహాలు పరాశక్తి శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆధీనంలో ఉన్నందున, అమ్మవారి సన్నిధిలో ఈ పూజలు చేయడం వల్ల భక్తులకు అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం వ్యక్తమైంది. భక్తులు పూజల్లో పాల్గొని మనసుని తీరుస్తూ సంతోషం పొందారు.

అలాగే, ఈ నెల 14వ తేదీన శ్రీ విజయదుర్గామల్లికార్జునుల శాంతి కళ్యాణం వైభవంగా జరగనుందని, 16వ తేదీ జేష్ట శుద్ధ విదియ నుండి జూలై 29వ తేదీ ఆషాఢ పౌర్ణమి వరకు ఆలయంలో విజయదుర్గా దేవి మండలదీక్ష (మాలధారణ) కార్యక్రమం నిర్వహించబడనుందని ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మల్లికార్జున రావు, నిర్వాహకులు దుర్గా ప్రసాద్ తెలిపారు.

అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.