BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 14 June 2026, 08:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్‌లో డీసీపీ తనిఖీలు – రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 08:47 PM
102 వీక్షణలు

విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం డీసీపీ గుణ్ణం రామకృష్ణ తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి, భవానిపురం ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు.

వర్షాకాలం నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలు, ఈదురు గాలులు, భారీ వర్షాల సమయంలో ప్రజలకు కలిగే ఇబ్బందులు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై డీసీపీ సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

అనంతరం రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత సమస్యలు ఉంటే పోలీసులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని సూచించారు.

కుటుంబ బాధ్యతలను గుర్తించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా కష్టపడి పనిచేసి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. సత్ప్రవర్తనతో మెలిగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పించేందుకు అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐ ఉమామహేశ్వరరావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.